గురుకులాల్లో విజిలెన్స్ తనిఖీలు
రాష్ట్రంలోని పలు గురుకులాల్లో మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.
- యూనిఫామ్స్, సరుకుల నాణ్యత పరిశీలన
- ఇప్పటికే టెండర్లపై అడ్డగోలు ఆరోపణలు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు గురుకులాల్లో మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్‌తోపాటు అదనంగా పీటీ, నైట్ట్రాక్, బూట్లు, సాక్సులు, ట్రంక్ బాక్సులు, ఐడీకార్డులు, ప్లేట్లు, గ్లాసు, కప్పు కటోరాలతోపాటు మొత్తంగా 24 వస్తువులతో కూడిన కిట్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన టెండర్ విలువ దాదాపు రూ.1,200 కోట్లు. గుజరాత్ తదితర కంపెనీలకు గత మే నెలలోనే ప్రభుత్వం కట్టబెట్టింది. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ సైతం 45 రోజుల్లోనే యూనిఫామ్స్‌ను సప్లయ్ చేయాల్సి ఉన్నది.
టెండర్లో ఇదే ప్రధానమైన నిబంధన. కానీ ఆ గడువు ముగిసి నెలలు దాటినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. వైట్ డ్రెస్, నైట్, పీటీ యూనిఫామ్స్ జాడ లేకుండాపోయింది. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు బూట్లు మాత్రమే సరఫరా చేశారు. సాక్సులు ఇవ్వలేదు. మరోవైపు కామన్ మెనూ అమలుకు సంబంధించి ఫుడ్ ప్రొవిజన్ టెండర్‌ను సైతం దాదాపు రూ.763 కోట్లకు గుత్తేదారుకు అధిక ధరలకు కట్టబెట్టింది.
ఫుడ్ప్రొవిజన్కు సంబంధించి కిరాణ సామగ్రి సరఫరాపై, నాణ్యతపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు, గురుకుల ప్రిన్సిపాళ్లు, వార్డెన్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది.ఇదిలావుంటే దీనిపై విజిలెన్స్ విభాగం అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. గురుకుల సొసైటీల ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

