తిరుప్పరంకుండ్రంపై వెలగని కార్తీక దీపం
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో ఉద్రిక్తత కొనసాగింది. కార్తీక పౌర్ణమి రోజున కొండపై ఉన్న దీపతూన్ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, మంగళవారం సాయంత్రం రాతి స్తంభం వద్ద కాకుండా, ఎప్పటిలాగే దీనికి కొంత దూరంలో ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయం దీప మండపంలో మహా దీపం వెలిగించారు. రాతి స్తంభం వద్ద మహా దీపం వెలిగించకపోవడంతో పలువురు భక్తులు ఆందోళనకు దిగారు.
- సుప్రీం ఆదేశాలు బేఖాతరు
చెన్నై: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో ఉద్రిక్తత కొనసాగింది. కార్తీక పౌర్ణమి రోజున కొండపై ఉన్న దీపతూన్ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, మంగళవారం సాయంత్రం రాతి స్తంభం వద్ద కాకుండా, ఎప్పటిలాగే దీనికి కొంత దూరంలో ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయం దీప మండపంలో మహా దీపం వెలిగించారు. రాతి స్తంభం వద్ద మహా దీపం వెలిగించకపోవడంతో పలువురు భక్తులు ఆందోళనకు దిగారు.
సంప్రదాయంగా ఉచ్చిపిళ్లైయార్ ఆలయంలోనే దీపం వెలిగించడంపై నిరసన వ్యక్తం చేయగా, వారిని పోలీసులు చెదరగొట్టారు. దీంతో ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుప్పరంకుండ్రం ఎమ్మెల్యే సీటీఆర్ నిర్మల్ కుమార్ సైతం ఎక్స్‌లో ఇదే విషయాన్ని పోస్టు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల్ని విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ధిక్కరించిందని, ఈ విషయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని ఆలయ భక్తుడు రమా రవికుమార్ చెప్పారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

