ప్రభుత్వ భూముల వేలంపై గులాబీ పోరు
కేపీహెచ్‌బీ కాలనీ, : నగర నడిబొడ్డున ప్రజా అవసరాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి.
- కాంగ్రెస్ సరార్ భూదందాపై
- వామపక్షాలతో కలిసి సమరశంఖం
- నేడు అమీర్‌పేట హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం ముట్టడికి సిద్ధం
- ప్రజలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ )/ కేపీహెచ్‌బీ కాలనీ, : నగర నడిబొడ్డున ప్రజా అవసరాల కోసం సేకరించిన విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, వామపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. కూకట్పల్లి హుడా ట్రక్ పార్కు భూములపై ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అమీర్‌పేట హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయ ముట్టడికి గులాబీ దళం పిలుపునిచ్చింది. కూకట్పల్లి నడిబొడ్డున నివాస ప్రాంతాల మధ్య ఉన్న హుడా ట్రక్ పార్ భూములు, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్ పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ముఖ్యంగా కూకట్ పల్లిలో వేలాది మంది లారీ, ఆటో డ్రైవర్లు, కార్మికులకు జీవనాధారంగా ఉన్న 3.15 ఎకరాల ట్రక్ పార్ స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేనిపక్షంలో స్థానికుల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు లేదా మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో వారం రోజులుగా వామపక్షాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి శాంతియుత నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే హెచ్ఎండీఏ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. మహానగర పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి అగ్రనేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు చేపడుతున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో నగర ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కార్మికులు స్వచ్ఛందంగా తరలివచ్చి హెచ్ఎండీఏ ముట్టడిని విజయవంతం చేయాలని మేడ్చల్ మలాజి గిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజల భూములను ప్రభుత్వం మొండిగా విక్రయించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపాలి: ఎమ్మెల్యే మాధవరం
హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. మంగళవారం కూకట్పల్లి క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాపాడిన స్థలాలను నేడు కాంగ్రె స్ సర్కార్ అమ్మకానికి పెట్టిందని, స్థలాలు అమ్మకుంటే ప్రభుత్వాన్ని నడపలేమని, సంక్షేమ పథకాలు ఇవ్వలేమని చెప్పుకోవడం సిగ్గుచేట్టన్నారు. కాంగ్రెస్ నేతలు గద్దెనెక్కెటప్పడు ఆర్ధిక పరిస్థితులు తెలియవా అని, సీఎం రేవంత్‌రెడ్డిని రాజకీయంగా పునరావాసం కల్పించి ఆదరించిన కూకట్‌పల్లిలో గజం జాగా కూడా లేకుండా అమ్ముతావా అని ప్రశ్నించారు. ప్రజలు నేరుగా నిరసనలో పాల్గొనాలని, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

