Vemulawada | వినాయకుడి మెడలో నోట్ల దండ ఎత్తుకెళ్లేందుకు యత్నించిన యువకుడు.. పోలీసులకు అప్పగింత
Vemulawada | వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను అపహరించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని యువకులు అడ్డుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఈ ఘటన జరిగింది.
Vemulawada | వేములవాడ: వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను అపహరించేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని యువకులు అడ్డుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద ఈ ఘటన జరిగింది.
జీవైసీ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి 500 రూపాయల నోట్లతో రూ.50 వేల విలువైన దండను అలంకరించారు. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి నోట్ల దండను గమనించి దానిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన యూత్ సభ్యులు వెంటనే అప్రమత్తమై అతడిని వెంబడించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నోట్ల దండను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

