Crime News | ఢిల్లీలో మరో దారుణం.. పోలీసులమని బెదిరించి 17 ఏళ్ల బాలికపై ముగ్గురి అఘాయిత్యం..!
Crime News | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులమని బెదిరించి ముగ్గురు యువకులు ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీ (South Delhi) లోని కల్కాజీ (Kalkaji) పరిధిలో ఉన్న ఒక పార్కులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Crime News : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులమని బెదిరించి ముగ్గురు యువకులు ఓ 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీ (South Delhi) లోని కల్కాజీ (Kalkaji) పరిధిలో ఉన్న ఒక పార్కులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. 17 ఏళ్ల బాధిత బాలిక తన స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరాన్ని సందర్శించింది. అనంతరం వారిద్దరూ సమీపంలోని పార్కులో కూర్చున్న సమయంలో పోలీసు దుస్తుల్లో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికి చేరుకున్నారు. తాము పోలీసులమని బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. ఆపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

