Bigg Boss 10 | అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి! నీతూ మాస్టర్ ఎలిమినేట్,సుధీర్‌కు ఊహించని సేవింగ్
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మరో కీలక ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ రావడంతో చివరికి నీతూ మాస్టర్, సుధీర్ బాటమ్ టూలో నిలిచారు. వీరిద్దరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున ఎంతో నాటకీయంగా నిర్వహించడంతో హౌస్ సభ్యుల్లోనూ టెన్షన్ పెరిగిపోయింది.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మరో కీలక ఎలిమినేషన్ చోటుచేసుకుంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ రావడంతో చివరికి నీతూ మాస్టర్, సుధీర్ బాటమ్ టూలో నిలిచారు. వీరిద్దరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున ఎంతో నాటకీయంగా నిర్వహించడంతో హౌస్ సభ్యుల్లోనూ టెన్షన్ పెరిగిపోయింది. చివరకు నీతూ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, సుధీర్ సేఫ్ అయ్యాడు. అయితే నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా సేఫ్ అవుతూ వచ్చారు. చివరకు నీతూ మాస్టర్, సుధీర్ మాత్రమే మిగలడంతో వీరిద్దరిలో ఒకరు ఇంటిని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియను మరింత ఆసక్తికరంగా మార్చారు.
ఇద్దరికీ కళ్లకు గంతలు కట్టాలని చెప్పడంతో అమన్, ముకేశ్ వారిద్దరికీ కళ్లకు గంతలు కట్టి గార్డెన్ ఏరియాకు తీసుకెళ్లారు. అనంతరం సుజుకీ కంపెనీకి చెందిన కారు అక్కడికి వస్తుందని, అందులో ఇద్దరూ బయటకు వెళ్తారని నాగార్జున వెల్లడించారు. తిరిగి కారు హౌస్‌లోకి వచ్చినప్పుడు అందులో ఒక్కరు మాత్రమే ఉంటారని, మరొకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. కారు తిరిగి ఎవరిని తీసుకొస్తుందనే విషయంలో నాగార్జున ఇంటి సభ్యులను అంచనా వేయమన్నారు. చాలామంది నీతూ మాస్టర్ తిరిగి వస్తారని భావించారు. ఆమె సేఫ్ అవుతుందని అనుకున్నారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి.
కారు తిరిగి వచ్చినప్పుడు అందులో సుధీర్ కనిపించడంతో అతడు సేవ్ అయినట్లు స్పష్టమైంది. దీంతో నీతూ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఊహించని ఈ పరిణామంతో హౌస్ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ మీదకు వచ్చిన నీతూ మాస్టర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. హౌస్ నుంచి వెళ్లిపోవాలని తాను కోరుకున్నానని, అక్కడ ఉండలేకపోయానని తెలిపారు. ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరుపై కూడా నీతూ తన అభిప్రాయాలను వెల్లడించారు. త్రిగుణ్, అమన్ చాలా బాగా గేమ్ ఆడుతున్నారని ప్రశంసించారు. అదే సమయంలో వర్షిణి, ముకేశ్, సుధీర్ ఆట ఆడటం లేదని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ హౌస్‌లోని కంటెస్టెంట్ల గేమ్‌పై కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది.
ఈ ఎపిసోడ్లో మరో ప్రత్యేక ఆకర్షణగా హీరోయిన్ రష్మిక మందన్న సందడి చేశారు. తన తాజా సినిమా ‘మైసా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడటంతో పాటు నాగార్జునతో ఆసక్తికరమైన సంభాషణ సాగించారు. ‘మైసా’ ట్రైలర్ చూసిన నాగార్జున ఆశ్చర్యపోయారని రష్మిక గుర్తు చేసుకున్నారు. ట్రైలర్లో కనిపించిన తన లుక్ చూసి నాగార్జున అసలు రష్మికనేనా అని ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు. దీనిపై నాగార్జున సరదాగా స్పందిస్తూ.. విజయ్ను చూసి నువ్వు కూడా రక్తం చూడటం అలవాటు చేసుకున్నావా అంటూ సెటైర్ వేశారు. అందుకు రష్మిక కూడా నవ్వుతూ.. అవును సార్, ట్రైనింగ్ అంతా ఇంట్లోనే ఉంటోంది అంటూ ఫన్నీగా బదులిచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి! నీతూ మాస్టర్ ఎలిమినేట్,సుధీర్‌కు ఊహించని సేవింగ్
TGSRTC | ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్!.. నీళ్లు లేకనే బస్సుల్లో జీవా బాటిల్స్ బంద్
Jagadish Reddy | సాగర్ దోపిడీపై సమరభేరి.. ఉమ్మడి నల్లగొండ ప్రజలను ఏకం చేసి పోరాడుతం: జగదీశ్‌రెడ్డి
KTR | వైద్య విద్యార్థులకు కేటీఆర్ భరోసా.. కొత్తపల్లి వద్ద నిరసనను చూసి మంత్రి దామోదరకు ఫోన్
PPF Loan | పీపీఎఫ్‌పై లోన్ కావాలా.. వడ్డీరేటు, నిబంధనలు తెలుసుకోండి
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

