వైద్య విద్యార్థులకు కేటీఆర్ భరోసా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి చొరవచూపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర శివారులోని వసుధ కన్వెన్షన్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుమార్తె వివాహానికి వెళ్తున్న ఆయన, మార్గమధ్యలో కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా చేయడం చూసి తన వాహనాన్ని ఆపారు. విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- కొత్తపల్లి వద్ద నిరసనను చూసి మంత్రి దామోదరకు ఫోన్
- నూతన కళాశాల భవనం అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి
- కేటీఆర్ చొరవపై విద్యార్థుల హర్షం
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి చొరవచూపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర శివారులోని వసుధ కన్వెన్షన్లో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కుమార్తె వివాహానికి వెళ్తున్న ఆయన, మార్గమధ్యలో కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నా చేయడం చూసి తన వాహనాన్ని ఆపారు. విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కళాశాలకు సొంత భవనం, హాస్టల్ వసతి, తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు లేక తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు వివరించారు. నూతన కళాశాల భవనం నిర్మాణం 90 శాతం పూర్తయినప్పటికీ మిగిలిన పనులు పూర్తి చేసి అప్పగించడంలో జాప్యం జరుగుతున్నదని చెప్పారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్ వెంటనే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసి, కరీంనగర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఎదురొంటున్న ఇబ్బందులను వివరించారు.
నూతన కళాశాల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారి సమస్యలను పరిషరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి పరిషారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కేటీఆర్ తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం, మంత్రితో మాట్లాడటంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

