అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి.. ఖండించిన అమెరికా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పర్షియన్ గల్ఫ్‌పై ప్రయాణిస్తున్న అమెరికా ఎఫ్-16 యుద్ధవిమానంపై క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ సైన్యం శనివారం ప్రకటించింది. విమానం దెబ్బతినడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యారని తెలిపింది.
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. పర్షియన్ గల్ఫ్‌పై ప్రయాణిస్తున్న అమెరికా ఎఫ్-16 యుద్ధవిమానంపై క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ సైన్యం శనివారం ప్రకటించింది. విమానం దెబ్బతినడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యారని తెలిపింది. ఎంక్యూ-9 రీపర్ సహా ఇప్పటివరకు 58 అమెరికా డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఖండించింది.
పశ్చిమాసియాలో తమ యుద్ధవిమానాలేవీ దాడికి గురికాలేదని తెలిపింది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియాన్ని మరో దేశానికి అప్పగించే ప్రసక్తే లేదన్నారు. శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా మళ్లీ దాడి చేయబోమని హామీ ఇవ్వాలని కోరారు. కేవలం యుద్ధం ముగించేందుకు ఏ ఒప్పందానికీ అంగీకరించబోమని, దీర్ఘకాలిక పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. గత జూన్‌లో కాల్పుల విరమణ కుదిరిన 15 రోజులకే మళ్లీ పోరు మొదలైందని గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

