Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్‌లో సినీ ప్రియులు
Anirudh-Kavya Maran | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకతో అనిరుధ్ కొత్త జీవితాన్ని ప్రారంభించగా, తాజాగా చెన్నైలో నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ సైతం అట్టహాసంగా జరిగింది.
Anirudh-Kavya Maran | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకతో అనిరుధ్ కొత్త జీవితాన్ని ప్రారంభించగా, తాజాగా చెన్నైలో నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ సైతం అట్టహాసంగా జరిగింది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వివాహ వేడుకలకు ఎంత ఖర్చు చేశారనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ వేడుకలు నవంబర్ 10, 11 తేదీల్లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. విదేశీ వేదికపై ప్రత్యేక ఏర్పాట్లతో ఈ వివాహ వేడుక నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.
కావ్య మారన్ సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఆమె కీలకంగా వ్యవహరిస్తుంటారు. అనిరుధ్ మాత్రం తన సంగీతంతో దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరి వివాహ వార్త సినీ, వ్యాపార, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రీస్‌లో వివాహ వేడుక జరిగిన అనంతరం చెన్నైలో అనిరుధ్, కావ్య మారన్ల వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు హాజరుకావడంతో సందడి నెలకొంది.
సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు, కార్తీ, సిద్ధార్థ్, రాధిక శరత్ కుమార్, అదితి రావు హైదరి, దర్శకుడు అట్లీ వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, భువనేశ్వర్ కుమార్ తదితరులు కూడా నూతన దంపతులను ఆశీర్వదించారు. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు రాజకీయ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, పళనిస్వామి తదితరుల పేర్లు ఈ వేడుకకు హాజరైన ప్రముఖుల జాబితాలో ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంచనాల ప్రకారం, గ్రీస్‌లో నిర్వహించిన వివాహ వేడుక కోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా చెన్నైలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది.ఈ రెండు వేడుకలకు కలిపి మొత్తం రూ.150 కోట్ల వరకు ఖర్చయిందనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఖర్చులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్‌లో సినీ ప్రియులు
Tollywood | బాక్సాఫీస్ వద్ద రెండు మంచి సినిమాలు.. ‘ENE రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్.. డిసెంబర్ 1 నుంచి భారీ ప్రచారం, సంక్రాంతికి మెగా సందడి!
Ar Rahman | ‘రామాయణ’ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bigg Boss 10 | అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి! నీతూ మాస్టర్ ఎలిమినేట్,సుధీర్‌కు ఊహించని సేవింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

