Ar Rahman | ‘రామాయణ’ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ar Rahman | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
Ar Rahman | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం తాను చేసిన కృషి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామాయణ’ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు పనిచేశానని ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు ఆ సమయంలో దాదాపు 10 నుంచి 12 భారీ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఒక ప్రతిష్ఠాత్మక సినిమాకు సంగీతం అందించేటప్పుడు దాని ప్రపంచంలో పూర్తిగా లీనమవ్వడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇఫిలో (IFFI) ‘బెనారస్’ సినిమా ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన రెహమాన్.. ‘రామాయణ’ కోసం తాను, తన బృందం చేసిన కృషి గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులో పనిచేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలోని సంగీతం కోసం ఎంతగా ప్రయోగాలు చేశారో రెహమాన్ మాటల్లోనే స్పష్టమవుతోంది. ముఖ్యంగా రావణుడి పాత్రకు సంబంధించిన ‘రావణ తాండవం’ సంగీతం కోసం ఏకంగా 13 వెర్షన్ల వరకు కంపోజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రతి ట్యూన్‌ను పరిశీలిస్తూ, సినిమాలోని సన్నివేశానికి ఏది బాగా సరిపోతుందో నిర్ణయించేందుకు ఎంతో సమయం కేటాయించినట్లు తెలిపారు. చివరకు అన్ని వెర్షన్లలో అందరికీ నచ్చిన ట్యూన్‌ను ఎంపిక చేసి సినిమాలో ఉపయోగించామని చెప్పారు.
ఒకే పాట లేదా సంగీత భాగం కోసం ఇన్ని వెర్షన్లు రూపొందించడం వెనుక సినిమాపై ఉన్న అంకితభావం, సంగీతాన్ని అత్యుత్తమ స్థాయిలో అందించాలనే తపన కనిపిస్తోంది. తాను ఏ సినిమాకు పనిచేయాలనే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని ఏఆర్ రెహమాన్ తెలిపారు. తనతో పాటు తన బృందం కూడా ఆ ప్రాజెక్టులో పనిచేయడాన్ని ఆస్వాదించగలదనే నమ్మకం కలిగినప్పుడే సినిమాకు అంగీకరిస్తానని చెప్పారు. కేవలం భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయనే కారణంతో సినిమాలను అంగీకరించనని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఒక సినిమా తనకు సృజనాత్మకంగా కొత్త అనుభూతిని ఇవ్వాలి, అందులో పనిచేసే అవకాశం తనకు సంతృప్తిని కలిగించాలి అనేది ముఖ్యమని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ar Rahman | ‘రామాయణ’ కోసం 12 సినిమాలు వదులుకున్నా.. ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bigg Boss 10 | అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి! నీతూ మాస్టర్ ఎలిమినేట్,సుధీర్‌కు ఊహించని సేవింగ్
TGSRTC | ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్!.. నీళ్లు లేకనే బస్సుల్లో జీవా బాటిల్స్ బంద్
Jagadish Reddy | సాగర్ దోపిడీపై సమరభేరి.. ఉమ్మడి నల్లగొండ ప్రజలను ఏకం చేసి పోరాడుతం: జగదీశ్‌రెడ్డి
KTR | వైద్య విద్యార్థులకు కేటీఆర్ భరోసా.. కొత్తపల్లి వద్ద నిరసనను చూసి మంత్రి దామోదరకు ఫోన్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

