National Song | వందేమాతరంపై రాజకీయ వివాదం.. మల్లికార్జున ఖర్గే కోసం సోనియా కుర్చీ అడిగారు: కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయం పూర్తి పాఠం ఆలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది.
- గేయాలాపనను సోనియా గాంధీ అడ్డుకున్నారు: బీజేపీ
- మల్లికార్జున ఖర్గే కోసం సోనియా కుర్చీ అడిగారు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయం పూర్తి పాఠం ఆలాపనపై రాజకీయ వివాదం చెలరేగింది. జాతీయ గేయం పూర్తిగా ఆలపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారని బీజేపీ ఆరోపించగా ప్రతిపక్ష కాంగ్రెస్ దీన్ని ఖండించింది.
ఓ వీడియోను బీజేపీ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ వందేమాతరం గేయాలాపన సమయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రశ్నించారని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించే సమయంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరగలేదని స్పష్టం చేసింది.
చాలా సేపటి నుంచి నిలబడి ఉన్న పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూర్చునేందుకు ఒక కుర్చీ తీసుకురావాలని మాత్రమే సోనియా గాంధీ చెప్పారని ఆ పార్టీ వివరించింది. తమ పార్టీ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయాన్ని పూర్తి పాఠాన్ని ఆలపించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

