Hyderabad | ఓయోకు వెళ్లిన జంట.. అర్ధరాత్రి హోటల్ గదిలో యువతి మృతి.. ప్రియుడు పరార్.. అసలేం జరిగింది?
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. సిద్దిఖీ నగర్లోని రోడ్ నంబర్-5లో ఉన్న ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. సిద్దిఖీ నగర్లోని రోడ్ నంబర్-5లో ఉన్న ఓయో హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో అనే యువతి తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఓయోలో రూం బుక్ చేసుకుంది. ఇద్దరూ మోటల్లో చెక్ ఇన్ అయ్యారు. అయితే అర్ధరాత్రి సమయంలో హోటల్ సిబ్బంది వద్దకు వచ్చిన రవితేజ.. తనతో వచ్చిన యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని తెలిపాడు. సిబ్బంది సాయంతో ఆమెను కొండాపూర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు. యువతి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హోటల్లో జంట బుక్ చేసుకున్న 303వ గదిని పరిశీలించగా గోడలు, బెడ్షీట్పై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. గదిలో ఖాళీ బీర్, విస్కీ బాటిళ్లు కూడా లభించాయి.
కాగా, యువతి మృతి చెందిన విషయం తెలియగానే ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అతని ఫోన్ చివరి లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నమోదైందని.. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు సమాచారం.
ఘటనపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. హోటల్ గదితో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆధారాలను పరిశీలిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు. యువతికి గాయాలు ఎలా అయ్యాయి? ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? హోటల్ గదిలో అసలు ఏం జరిగింది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

