Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్
Air India London flight U-turn | లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మార్గమధ్యలో యూటర్న్ తీసుకున్నది. సాంకేతిక లోపం కారణంగా సౌదీ గగనతలంలో వెనక్కి మళ్లింది. ఏడు గంటలు ప్రయాణించిన ఆ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకున్నది.
న్యూఢిల్లీ: లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మార్గమధ్యలో యూటర్న్ తీసుకున్నది. సాంకేతిక లోపం కారణంగా సౌదీ గగనతలంలో వెనక్కి మళ్లింది. ఏడు గంటలు ప్రయాణించిన ఆ విమానం తిరిగి ఢిల్లీకి చేరుకున్నది. (Air India London flight U-turn) ఎయిర్ ఇండియాకు చెందిన ఏ350 విమానం (ఏఐ 111) లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్లేందుకు గురువారం ఉదయం 6.13 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. సుమారు మూడు గంటల పాటు 3,300 కిలోమీటర్లు గాలిలో ప్రయాణించింది.
కాగా, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రభావితమైన సౌదీ అరేబియా గగనతలంపై ఉన్న ఎయిర్ ఇండియా విమానం మరో ఏడు గంటలు ప్రయాణించి లండన్ చేరుకోవాల్సి ఉన్నది. అయితే అనూహ్యంగా అది వెనక్కి మళ్లింది. విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా గాలిలో యూ టర్న్ తీసుకున్నది. మరో మూడున్నర నుంచి నాలుగు గంటలపాటు వెనక్కి ప్రయాణించింది. మొత్తం ఏడు గంటల ప్రయాణం తర్వాత గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయింది.
మరోవైపు సౌదీ అరేబియా గగనతలంపై ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో పెద్ద శబ్దాలు వినిపించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతో యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. అనుకోని పరిస్థితి కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో ప్రయాణికులు లండన్ చేరుకునేలా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఢిల్లీకి తిరిగి రావడానికి ఎయిర్ ఇండియా విమానం సుదీర్ఘ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నదో అన్నది తెలియలేదు.
Also Read:
Railways Fines IRCTC | సొంత సంస్థ ‘ఐఆర్సీటీసీ’కు.. రూ.10 లక్షల జరిమానా విధించిన రైల్వే
Tanker with Russian oil struck | రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై.. డ్రోన్ బోటు దాడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

