Tanker with Russian oil struck | రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై.. డ్రోన్ బోటు దాడి
Tanker with Russian oil struck | రష్యా చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్ నౌకపై డ్రోన్ బోటు దాడి జరిగింది. టర్కీ తీరం సమీపంలోని నల్ల సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడి వల్ల నౌక బ్రిడ్జిపై పేలుడు సంభవించిందని, ఇంజిన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించిందని టర్కీ మీడియా పేర్కొంది.
అంకారా: రష్యా చమురు రవాణా చేస్తున్న ట్యాంకర్ నౌకపై డ్రోన్ బోటు దాడి జరిగింది. టర్కీ తీరం సమీపంలోని నల్ల సముద్రంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడి వల్ల నౌక బ్రిడ్జిపై పేలుడు సంభవించిందని, ఇంజిన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించిందని టర్కీ మీడియా పేర్కొంది. (Tanker with Russian oil struck) షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం సియెర్రా లియోన్ జెండా కలిగిన ‘అల్టురా’ నౌక సుమారు 10 లక్షల బ్యారెల్స్ ముడి చమురుతో రష్యాలోని నోవోరోస్సిస్క్ ఓడరేవు నుంచి బయలుదేరింది. అయితే యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దీనిపై ఆంక్షలు విధించాయి.
కాగా, ఇస్తాంబుల్ బోస్ఫరస్ జలసంధికి సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ట్యాంకర్‌ను డ్రోన్ బోటు ఢీకొట్టినట్లు టర్కీ మీడియా గురువారం తెలిపింది. టర్కీ సంస్థ బెసిక్టాస్కు చెందిన ఈ నౌక బ్రిడ్జిపై పేలుడు సంభవించినట్లు పేర్కొంది. ఈ పేలుడు కారణంగా ట్యాంకర్ ఇంజిన్ రూమ్‌లోకి నీరు ప్రవేశించినట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ ఆయిల్ ట్యాంకర్‌కు సహాయం కోసం తీర రక్షక దళ నౌక, అత్యవసర ప్రతిస్పందన నౌకను టర్కీ పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఆ నౌకలోని 27 మంది సిబ్బందిని రక్షించినట్లు పేర్కొంది.
Also Read:
Iran Warning | మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
Iran Citizens | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం
USS Abraham Lincoln | హెచ్చరించిన తర్వాత.. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగం!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

