Iran Warning | మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ వార్నింగ్
Iran Warning | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్ (US-Israel) దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ (Iran) పై భూతల దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)' తీవ్ర హెచ్చరిక చేసింది.
Iran Warning : పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్ (US-Israel) దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ (Iran) పై భూతల దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)’ తీవ్ర హెచ్చరిక చేసింది. ‘మీ పిల్లలను, సైనికులను ఇరాన్ గడ్డ మీదికి పంపి వారిని బలి చేయవద్దు’ అని అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్ సరిహద్దుల వద్ద అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయంటూ వినపడుతున్న వార్తల నేపథ్యంలో ఐఆర్జీసీ ఈ హెచ్చరికలు చేసింది. తమ దేశంలోకి అడుగుపెట్టే ఏ శత్రు సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి బయటికి వెళ్లలేడని స్పష్టంచేసింది. దేశ రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు, అత్యాధునిక క్షిపణులు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది.
తమను తాము రక్షించుకోవడమే కాకుండా శత్రువుల స్థావరాలపై ఎదురుదాడి చేసే సామర్థ్యం కూడా తమకు ఉందని ఇరాన్ పేర్కొన్నది. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాదని, మొత్తం పశ్చిమాసియాకు వ్యాపిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన శత్రు దేశాల ప్రజలలో భయాందోళనలు సృష్టించేందుకు మానసిక యుద్ధానికి తెరలేపినట్లు అనిపిస్తోంది.
‘యుద్ధానికి మీ పిల్లలను పంపి అనవసరంగా చంపించవద్దు.. వారిని నరకానికి పంపిచవద్దు’ అనే నినాదాన్ని ఇరాన్ సైన్యం విస్తృతంగా ప్రచారంలోకి తెస్తున్నది. మా దేశంలో అడుగుపెడితే చంపేస్తామంటూ మానిసికంగా ఇజ్రాయెల్ ప్రజలను భయంలోకి నెడుతోంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

