Sutanshu Kotak : గాలే టెస్టులో రిటైర్డ్ హర్ట్ అయిన కేఎల్ రాహుల్ (KL Rahul) ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధ శతకంతో రాణించిన అతడు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి రాలేదు. దాంతో, రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అనేది తెలియడం లేదు. అయితే.. బ్యాటింగ్ కోచ్ సుతాన్ష్ కొటక్ (Sutanshu Kotak) మాత్రం రాహుల్ ఫిట్‌నెస్‌పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్‌గానే ఉన్నాడని సుతాన్ష్ వెల్లడించాడు.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అర్ధ శతకంతో రాణించిన కేఎల్ రాహుల్ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. టీ బ్రేక్ తర్వాత కుడి చేతికి క్రాంప్స్ కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో నడిచేందుకు సైతం ఇబ్బందిపడ్డాడీ ఓపెనర్. రిటైర్డ్ హర్ట్ అయిన రాహుల్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(16) ఔటైనా క్రీజులోకి రాలేదు. దాంతో.. అతడి ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ బ్యాటింగ్ కోచ్ సుతాన్ష్ కొటక్ మాత్రం అవన్నీ నమ్మొద్దు అంటున్నాడు.
“Only cramps,” confirms India’s batting coach
KL Rahul will be back to bat 🧘 pic.twitter.com/rrfjYH8tGX
— Cricinfo (@cricinfo) August 15, 2026
‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటాడు’ అని సుతాన్ష్ పేర్కొన్నాడు.

గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులతో రాణించాడు రాహుల్. యశస్వీ(32) రనౌట్ అనంతరం.. దేవ్‌దత్ పడిక్కల్(131 నాటౌట్)తో రెండో వికెట్‌కు 150 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా.. తొలి రోజు 288/2తో పటిష్ట స్థితిలో నిలిచింది టీమిండియా.