Iran Citizens | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం
Iran Citizens | ఇరాన్, ఇజ్రాయెల్ (Iran, Israel) మధ్య యుద్ధంతో పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి తమ దేశానికి వచ్చే సందర్శకులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది.
Iran Citizens : ఇరాన్, ఇజ్రాయెల్ (Iran, Israel) మధ్య యుద్ధంతో పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి తమ దేశానికి వచ్చే సందర్శకులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆస్ట్రేలియా హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఇరాన్ పాస్పోర్ట్ కలిగిన వారు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఇప్పటికే జారీచేసిన వీసాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ తన సైనిక కార్యకలాపాలను పెంచుతూ ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు. కాగా అమెరికా, ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగంగానే ఆస్ట్రేలియా ఈ అడుగు వేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో అక్కడికి వెళ్లాలనుకుంటున్న ఇరాన్ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్ట్రేలియా చర్యపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

