ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
చింతపల్లి మండలం చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుల అక్షిత అంతర్జాతీయ స్థాయిలో వెండి పతకం సాధించడం గర్వకారణమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శ్రీలంకలో జరిగిన...
– సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్-2026లో వెండి పతకం
మాల్, నవంబర్ 26 : చింతపల్లి మండలం చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుల అక్షిత అంతర్జాతీయ స్థాయిలో వెండి పతకం సాధించడం గర్వకారణమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శ్రీలంకలో జరిగిన రెండవ సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్-2026లో చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుల జగతయ్య – సంతోష దంపతుల కుమార్తె అక్షిత ద్వితీయ బహుమతిగా వెండి పతకం సాధించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్షిత వెండి పతకం సాధించడం చింతపల్లి మండలానికే కాకుండా నల్లగొండ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రీడారంగంలో అక్షిత సాధించిన ఈ విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీశైలం, ఉప సర్పంచ్ వెంకటేశ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల శ్రీను, వార్డు సభ్యులు మదుర వెంకటయ్య, గొట్టె పర్వతాలు, ఉడుతల అబ్బి, శ్రీనివాస్, మల్లన్న, రాజు, ఉడుతల శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Ramayana | అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ చిత్రబృందం.. రణబీర్, సాయిపల్లవిపై ప్రశంసలు
Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

