Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్ (Male Employees) కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న వివాహిత మగ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను (Paternity Leaves) మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ఒక ప్రకటన చేశారు.
Tamil Nadu : తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్ (Male Employees) కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న వివాహిత మగ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను (Paternity Leaves) మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పురుషులకు ఇలాంటి సౌకర్యం కల్పించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
పైగా ఈ సెలవును తమకు అనుకూలమైన సమయంలో తీసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందుగానీ, లేదా బిడ్డ పుట్టిన నాటి నుంచి ఆరు నెలల లోపుగానీ ఈ సెలవును వినియోగించుకోవచ్చని ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బిడ్డ పుట్టిన తొలిదశలో సంరక్షణ బాధ్యతలను తండ్రులు కూడా పంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పురుష ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 365 రోజుల ప్రసూతి సెలవులు అమలవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Ramayana | అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ చిత్రబృందం.. రణబీర్, సాయిపల్లవిపై ప్రశంసలు
Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
‘ఈ 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్’
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

