Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
Health tips | ఇంగువ (Asafoetida) ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది. పప్పు, పప్పుచారు, పులిహోరతోపాటు వివిధ రకాల నిలువ తొక్కుల్లో కూడా ఇంగువను వాడుతారు.
Health tips : ఇంగువ (Asafoetida) ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది. పప్పు, పప్పుచారు, పులిహోరతోపాటు వివిధ రకాల నిలువ తొక్కుల్లో కూడా ఇంగువను వాడుతారు. ఇంగువను వాడటంవల్ల ఆహారం చెడిపోకుండా ఉంటుంది. ఇవేగాక ఇంగువతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
1. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
2. ఇంగువ పొడిలో యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాయి.
3. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి కూడా ఇంగువ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకోసం మహిళలు బెల్లంలో బఠానీ గింజంత ఇంగువ పెట్టుకుని తినాలి.
4. తరచూ తలనొప్పితో బాధపడేవాళ్లు ఒక కప్పు మరిగించిన నీళ్లలో చిటికెడు ఇంగువ వేసి రోజుకు రెండు మూడుసార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది.
5. పిల్లలకు కడుపులో నులి పురుగులు ఉంటే శనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తినిపించాలి. మంచి ప్రయోజనం ఉంటుంది.
6. రోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను నెయ్యి, వాము, ఇంగువను కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తీరిపోతాయి.
గమనిక : అయితే ఇంగువను పరిమితంగా వాడితేనే ప్రయోజనకారిలా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
‘ఈ 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్’
Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

