Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Bengaluru | బెంగళూరులో పాకిస్థానీ టీవీ డ్రామా ‘దార్-ఏ-నిజాత్’ (Dar-e-Nijaat) ప్రైవేట్ స్క్రీనింగ్‌ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.
బెంగళూరులో పాకిస్థానీ టీవీ డ్రామా ‘దార్-ఏ-నిజాత్’ (Dar-e-Nijaat) ప్రైవేట్ స్క్రీనింగ్‌ల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. నవంబర్ 28, డిసెంబర్ 5 తేదీల్లో నగరంలోని రెండు వేర్వేరు వేదికల్లో ప్రదర్శించాల్సిన ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, అదే సమయంలో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారు.
వివరాల్లోకి వెళితే, ‘దార్-ఏ-నిజాత్’ సీరియల్‌కు సంబంధించిన ప్రత్యేక వాచ్ పార్టీలను రెండు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేశాయి. మొదటి కార్యక్రమాన్ని ‘ది బ్లూమ్ సొసైటీ సిస్టర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో నవంబర్ 28న సాయంత్రం 6 గంటలకు ఫ్రేజర్ టౌన్‌లోని ‘షీష్కబాబ్’ (Sheeshkebab) రెస్టారెంట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో ఆ డ్రామాకు చెందిన 34, 35 ఎపిసోడ్లను ప్రదర్శించి, అనంతరం పర్షియన్, అరబిక్ వంటకాలతో విందు ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఇక రెండో కార్యక్రమాన్ని ‘ది స్టార్ క్లబ్’ ఆధ్వర్యంలో డిసెంబర్ 5న జయమహల్ ఎక్స్‌టెన్షన్‌లోని ఒక ప్రైవేట్ థియేటర్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
అయితే, ఈ స్క్రీనింగ్‌లకు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్లు ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులు ‘పాకిస్థానీ దుస్తులు’ (Pakistani clothing) ధరించి రావాలని ఆహ్వాన పత్రికల్లో డ్రెస్ కోడ్ విధించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో పాకిస్థానీ వినోద కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏమిటంటూ పలువురు ఎక్స్ వేదికగా బెంగళూరు సిటీ పోలీసులను, పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆర్. హితేంద్ర, ఈ రెండు కార్యక్రమాల నిర్వహణకు పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రదర్శనల వల్ల నగరంలో నిరసనలు చెలరేగి శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న ఆందోళనతో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు నిర్వాహకులను సంప్రదించి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణ, ఆన్లైన్లో వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో రెండు వేదికల నిర్వాహకులు ఈ ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం సరదాగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యక్రమం కాస్తా పెద్ద వివాదంగా మారడంతో రద్దు చేసుకున్నట్లు డిసెంబర్ 5వ తేదీ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. నవంబర్ 28న జరగాల్సిన షో కూడా రద్దయినట్లు రెస్టారెంట్ యాజమాన్యం ధృవీకరించింది. ఈ రెండు షోలు రద్దయిన విషయాన్ని పులకేశినగర్ పోలీసులు కూడా అధికారికంగా ధృవీకరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
Dementia | డిమెన్షియా అంటే ఏమిటి.. మతిమరుపుకు, దీనికి ఏమిటి సంబంధం..?
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

