Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
Dr Hassan | ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో, దియా మీర్జా కీలక పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ 'డాక్టర్ హసన్'.
Dr Hassan | ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో, దియా మీర్జా కీలక పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘డాక్టర్ హసన్’. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను జియోహాట్‌స్టార్ (JioHotstar) తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందిన అమెరికన్ మెడికల్ డ్రామా ‘హౌస్’ (House) ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించారు. రోహన్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 11 నుండి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ టైటిల్ పాత్ర అయిన ‘డాక్టర్ హసన్’గా కనిపించనున్నారు. ఎంతో క్లిష్టమైన వైద్య కేసులను సైతం తన అసాధారణ తెలివితేటలతో ఛేదించే నిపుణుడిగా ఆయన పాత్ర సాగుతుంది. వైద్య పరిశోధనలు, రోగులు మరియు వైద్యుల మధ్య జరిగే భావోద్వేగపూరిత డ్రామా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వైద్యులు చేసే చిన్న పొరపాటు కూడా రోగి ప్రాణాల మీదకు ఎలా తెస్తుందనే ఉత్కంఠభరిత అంశాలను ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త వైద్య సవాలు, లక్షణాలను విశ్లేషించి వ్యాధి మూలాలను కనిపెట్టే విధానంతో పాటు విలక్షణమైన డాక్టర్ వల్ల ఎదురయ్యే హాస్యం, అంతర్గత సంఘర్షణలను ఇందులో మేళవించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
‘ఈ 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్’
Pakistani Drama | బెంగళూరులో పాక్ డ్రామాకు బ్రేక్.. సోషల్ మీడియా వ్యతిరేకతతో రెండు షోలు రద్దు!
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

