Samantha | ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ హోస్ట్‌గా సమంత.. ప్రోమో విడుదల..!
Samantha : ఈమధ్యే 'మా ఇంటిబంగారం'తో సూపర్ హిట్ కొట్టిన సామ్.. 'సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్' షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది.
Samantha : టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత రుతుప్రభు (Samantha Ruth Prabhu) కొత్త జర్నీ ప్రారంభించనుంది. ఈమధ్యే ‘మా ఇంటిబంగారం’తో సూపర్ హిట్ కొట్టిన సామ్.. ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఈ రియాలిటీ సిరీస్‌ను ఆద్యంతం సమంత నడిపింనుందని శనివారం సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ వెల్లడించింది. తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు ఈ వంట పోటీల్లో పాల్గొంటారని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపిందీ సంస్థ.
‘మా ఇంటి బంగారం’ సినిమాలో వంటరాని కోడలి పాత్రలో నటించిన సమంత ఈసారి ఏకంగా మాస్టర్ కుకింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్కు సంబంధించిన సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ షోను అన్నీతానై నడిపంచనుంది స్టార్ హీరోయిన్. ఈ కుకింగ్ షోకు హోస్ట్‌గా సమంతను పరిచయం చేస్తూ శనివారం ప్రోమోను విడుదల చేసింది సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్.
‘అసలుసిసలైన వంటపోటీ ఇక్కడ మొదలవ్వనుంది. సమంత రుతుప్రభు ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనుంది. సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ త్వరలోనే సోనీ, సోనీ లీవ్‌లో మీముందుకు రానుంది’ అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టిందీ సంస్థ. ఈ షో గురించి సమంత మాట్లాడుతూ.. తాను ఈ కుకింగ్ షో పట్ల తాను ఆతృతగా ఉన్నట్టు చెప్పింది.
‘ఎట్టకేలకు మీ అందరితో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సెలబ్రటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ అనేది నేను ఇదివరకు చేసిన షోలాంటిది కాదు. అందుకే నేను ఈ షోకు హోస్ట్‌గా ఉండలేను అని చెప్పలేకపోయా. భోజనం అందర్నీ ఒక్కటి చేస్తుంది. ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తుంది. కెమెరాలు చూడని మీలోని కొత్తకోణాన్ని బయటపెడుతుంది. తమిళ చిత్రసీమలోని కొందరు సెలబ్రిటీలు కిచెన్‌లో అడుగుపెట్టడం, సవాళ్లను స్వీకరించడం, పొరపాట్లు చేయడం, ఆశ్చర్యానికి గురవ్వడం, ఎంతో ఇష్టంతో పోటీపడడం వంటివి చూసేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఉన్నా. ఎవరు వంట చేస్తారో నేను చెప్పగలను. కానీ, అందులో ఫన్ ఏముంటింది? సోనీ విజాతో మనం ఏం కుక్ చేయబోతున్నాం అనేది ప్రతిఒక్కరూ ఆస్వాదించేలా చేయడానిక నేను ఇంకా వేచి ఉండలేకపోతున్నా’ అని సమంత పేర్కొంది. సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ షోను బనిజయ్ ఆసియా అనే కంపెనీ నిర్మిస్తోంది. అయితే.. తొలిసారి తల్లికాబోతున్న సమంత.. ఈ షోతో ఎప్పుడు మన ముందుకు రాబోతోంది? అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

