Allu Aravind | రుహానీ శర్మకు అల్లు అరవింద్ పెళ్లి సలహా.. హైదరాబాద్ అబ్బాయిని చూసుకోమంటూ కామెంట్స్.. !
Allu Aravind | టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏ వేదికపై మాట్లాడినా తనదైన చమత్కారంతో అందరినీ నవ్విస్తుంటారు. ముఖ్యంగా సినిమా వేడుకల్లో ఆయన చేసే సరదా వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా ‘ఆకాశంలో ఒక తార’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన హీరోయిన్ రుహానీ శర్మ వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇచ్చిన సలహాను గుర్తుచేస్తూ రుహానీకి కూడా అదే తరహాలో పెళ్లి సలహా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న హీరోయిన్ రుహానీ శర్మతో ఆయన చేసిన సంభాషణ అందరినీ నవ్వించింది. సక్సెస్ మీట్లో మాట్లాడుతున్న సమయంలో అల్లు అరవింద్ రుహానీ శర్మను ఉద్దేశించి సరదాగా మాట్లాడారు. ‘‘రుహానీ.. నువ్వు కూడా హైదరాబాద్‌లోనే ఎవరైనా మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా?’’ అంటూ సలహా ఇచ్చారు. దీనికి రుహానీ చిరునవ్వుతో ‘ఇట్స్ ఎ బ్లెస్సింగ్’ అని సమాధానమిచ్చింది.
వెంటనే అల్లు అరవింద్ స్పందిస్తూ.. ‘‘అంటే నీ మనసులో ఇప్పటికే ఎవరైనా ఉన్నారా?’’ అంటూ చమత్కరించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. రుహానీ పెళ్లి గురించి అల్లు అరవింద్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇదే సందర్భంగా గతంలో తాను హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా ఇలాంటి సలహానే ఇచ్చిన విషయాన్ని అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని తాను గతంలో చెప్పానని, ఆ తర్వాత ఆమె నిజంగానే మెగా హీరో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని మెగా కుటుంబంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు రుహానీ శర్మకు కూడా హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలని సలహా ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. దీంతో రుహానీ కూడా త్వరలో హైదరాబాద్ కోడలు అవుతుందా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ అల్లు అరవింద్ చేసిన సరదా వ్యాఖ్యలు మాత్రమే. రుహానీ వివాహానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Aravind | రుహానీ శర్మకు అల్లు అరవింద్ పెళ్లి సలహా.. హైదరాబాద్ అబ్బాయిని చూసుకోమంటూ కామెంట్స్.. !
IND vs NZ | టీ బ్రేక్‌కు పుంచుకున్న భారత్.. 3 ఓవర్లలో 3 వికెట్లు!
India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వచ్చేసిన వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఏకే47’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

