నిశ్శబ్ద విధ్వంసం
సాధారణంగా స్టార్ హీరోల ఇంట్రోస్ అంటే తెరపై ఓ రేంజ్ హంగామానే సృష్టిస్తారు దర్శకులు. భారీ డీజే సౌండ్ల మధ్య, రౌడీల హాహాకారాల మధ్య హీరో తెరపై ఎంట్రీ ఇస్తాడు. అంతే అభిమానుల్లో పూనకాలు మొదలవుతాయి. కానీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా శైలి ప్రత్యేకం.
సాధారణంగా స్టార్ హీరోల ఇంట్రోస్ అంటే తెరపై ఓ రేంజ్ హంగామానే సృష్టిస్తారు దర్శకులు. భారీ డీజే సౌండ్ల మధ్య, రౌడీల హాహాకారాల మధ్య హీరో తెరపై ఎంట్రీ ఇస్తాడు. అంతే అభిమానుల్లో పూనకాలు మొదలవుతాయి. కానీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా శైలి ప్రత్యేకం. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఎంట్రీని ఆయన చాలా భిన్నంగా ప్లాన్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. సెంట్రల్ జైల్లో ఉన్నట్టుండి గందరగోళం చెలరేగడం.. ఖైదీలందరూ నియంత్రణ కోల్పోవడం.. పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేకపోవడం.. ఈ విధ్వంసం మధ్య నిశ్శబ్దంగా ఓ హిందీ క్లాసిక్ సాంగ్ వింటూ సైలెంట్‌గా, సైకోటిక్‌గా ప్రభాస్ ఎంట్రీ ఇస్తారట.
అయితే.. ఈ సన్నివేశంలో ప్రభాస్‌ని వెంటనే రివీల్ చేయకుండా, ఖైదీల కళ్లలో కనిపించే భయం ద్వారా ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇస్తూ, నిదానంగా ప్రభాస్‌ని రివీల్ చేస్తారట. ప్రభాస్ కెరీర్లోనే ప్రత్యేకంగా చెప్పుకునేలా ఈ ఇంట్రడక్షన్ ఉంటుందని వినికిడి. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. సీనియర్ నటి కాంచన, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణం: టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

