UP Accident | నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మృతి, 27 మందికి గాయాలు
UP Accident | రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది.
లక్నో: రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. (UP Accident) ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ప్రయాగ్రాజ్లో జరిగిన తలనీలాల సమర్పణ కార్యక్రమానికి హాజరయ్యారు. పికప్ వాహనంలో వారు తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, శుక్రవారం కౌశాంబి జాతీయ రహదారిలోని దోర్మా గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న పికప్ వ్యాన్ రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న పలు ఆసుపత్రులకు తరలించారు.
అయితే గాయపడి చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. పికప్ వాహనం డ్రైవర్ నిద్ర మత్తులో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Claims As Godman, Man Raps Woman | శివుడి అవతారమని నమ్మించిన వ్యక్తి.. మహిళపై అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

