Harish Rao : రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బస్తాల యూరియా కూడా ఇవ్వలేకపోతుందా అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. యూరియా కోసం ఒక రైతు కాళ్లు పట్టుకోవడంపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా, దీనిపై ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. రైతులకు అవసరమైన యూరియా బస్తాల్ని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదు.
దీంతో రైతులు యూరియా కోసం తెలంగాణ అంతటా పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. రైతుల గోసకు తాజా ఘటన మరో ఉదాహరణ. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఒక రైతు రెండు బస్తాల యూరియా కోసం అక్కడున్న నిర్వాహకుల కాళ్లు పట్టుకున్నాడు. ఎలాగైనా రెండు బస్తాల యూరియా ఇప్పించాలంటూ ఆ రైతు వేడుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్న వారి గుండె బరువెక్కేలా చేసింది. తెలంగాణలో, కాంగ్రెస్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇది నిదర్శనంగా నిలిచింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో రెండు బస్తాల యూరియా కోసం, అందరికీ అన్నం పెట్టే రైతన్న కాళ్లు పట్టుకుంటున్న ఈ దృశ్యమే… ‘మార్పు’ పేరిట కాంగ్రెస్ తెచ్చిన ‘ఏ మార్పు’కు నిదర్శనం.@TelanganaCMO pic.twitter.com/vP2cXZfO51
— Harish Rao Thanneeru (@BRSHarish) August 12, 2026
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అందరికీ అన్నం పెట్టే రైతు ఆవేదనపై ప్రశ్నించారు. ‘మార్పు’ పేరిట కాంగ్రెస్ తెచ్చిన ఈ దృశ్యం ‘ఏ మార్పు’కు నిదర్శనం అంటూ ప్రశ్నించారు. తమ యూరియా కష్టాలు తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.