హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) డిప్యూటీ డైరెక్టర్గా ప్రొఫెసర్ పి.రతీష్ కుమార్ (P.Ratish Kumar) నియమితులయ్యారు. నిట్ పరిపాలనా బాధ్యతల్లో సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. దాంతో.. డిప్యూటీ డైరెక్టర్ పదవి రతీశ్ను వరించింది. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసరైన ఆయన బోధన, పరిశోధన, విద్యా పరిపాలన రంగాల్లో విశేష సేవలు అందించారు.
ఎన్ఐటీలో డీన్ (ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్), సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా, అలాగే పలు ఇతర పరిపాలనా బాధ్యతల్లో రతీష్ కుమార్ సేవలందించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ సీనియర్ సభ్యుడిగానూ ఉన్నారాయన. డిప్యూటీ డైరెక్టర్గా కొత్త బాధ్యతల్లో భాగంగా.. రతీశ్ కుమార్ సంస్థలోని విద్యా, పరిపాలనా, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించనున్నారు.