Viral News : కోతిని వేటాడుతూ ఓ చిరుతపులి (Leopard) ప్రాణాలు కోల్పోయింది. కోతిని వెంబడిస్తున్న క్రమంలో ట్రాన్స్ఫార్మర్ (Transformer) కు తగలడంతో విద్యుత్‌షాక్ (Electrocution) కు గురై చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. చిరుత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృత్యువాత పడిన ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా చిమూరు తాలూకాలో ఇవాళ చోటుచేసుకుంది.
శంకరాపూర్ గ్రామ పరిసరాల్లో ఐదేళ్ల వయసున్న ఆడ చిరుత ఓ వానరాన్ని వేటాడుతూ గ్రామ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ స్తంభాలపైకి ఎక్కింది. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కళేబరాన్ని చిమూరు అటవీ క్షేత్రానికి తరలించిన అటవీ అధికారులు శవ పరీక్షలు నిర్వహించి ఖననం చేశారు.