CISF | సహోద్యోగులపై సీఐఎస్ఎఫ్ జవాన్ కాల్పులు.. నలుగురు దుర్మరణం..!
CISF | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన ఒక జవాన్ తన సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు.
CISF : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన ఒక జవాన్ తన సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. కతువా జిల్లా (Kathuva district) లోని సేవా-2 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కతువా జిల్లాలోని బసోహ్లి ప్రాంతంలో ఉన్న సేవా-2 హైడల్ పవర్ ప్రాజెక్టుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీ మార్పు జరుగుతుండగా హెడ్ కానిస్టేబుల్ అవధేశ్ సింగ్ అనే జవాన్‌కు, ఇతర సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అవధేశ్ సింగ్.. తన వద్ద ఉన్న తుపాకీతో సహోద్యోగులపై కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు రఫిక్ అహ్మద్, సందీప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది, నిందితుడు అవధేశ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, కతువా పోలీసులకు అప్పగించారు.
కతువా ఎస్ఎస్పీ మోహితా శర్మ ఈ ఘటనను ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి విచారణకు (కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ) ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ డీజీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేవలం చిన్న వాగ్వాదమే ఈ దారుణానికి కారణమా లేక మరేదైనా నేపథ్యం ఉందా..? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CISF
- cisf jawan
- colleagues
- Firing
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

