Gadwal Municipality | గద్వాల, సెప్టెంబర్ 29 : గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్ షాపుల అద్దెల రూపంలో వసూలైన రూ.11.28 లక్షలను ఖాతాలో జమ చేయకపోవడం, నిధుల దుర్వినియోగం, ఔట్సోర్సింగ్ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంపై ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు ఆర్వో రాజేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ షరాఫ్ రాజవర్ధన్ నాయుడులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వసూలైన అద్దె సొమ్మును నిర్ణీత గడువులోగా మున్సిపల్ ఖాతాలో జమ చేయకపోవడంతోపాటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంలో నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. అద్దె వసూళ్లకు సంబంధించిన రశీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్ వివరాలు, లెక్కలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్