School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
School Students Fall Ill | తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నది. దీంతో ఆ ప్లాంట్ సమీపంలోని స్కూల్‌కు చెందిన 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
తిరువనంతపురం: తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నది. దీంతో ఆ ప్లాంట్ సమీపంలోని స్కూల్‌కు చెందిన 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. (School Students Fall Ill) కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొట్టియాంలోని తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా బుధవారం ఆక్సిలియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ స్కూల్లో క్లాసుల నిర్వహణను నిలిపివేశారు.
కాగా, బాధిత విద్యార్థులకు ప్రత్యేక వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా వైద్యాధికారిని మంత్రి బిందు కృష్ణ ఆదేశించారు. అలాగే ఒక వైద్య బృందం ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. అయితే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడంపై పాలక పక్షం సీపీఎంకు చెందిన యువజన విభాగమైన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సంఘటనపై ఆందోళనకు దిగారు.
మరోవైపు కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనపై స్వయంగా కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ఇంజినీర్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది.
అయితే తారు మిక్సింగ్ ప్లాంట్ కారణంగా గతంలో కూడా ఇదే పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇలాంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా స్థానికులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తారు ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేయాలని పంచాయతీ ఆదేశించింది. అయితే ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ప్లాంట్‌ను తిరిగి తెరిచి నిర్వహించేందుకు అనుమతి పొందింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సుస్మితకు న్యాయం జరిగే దాకా పోరాడుతామని తల్లికి కేటీఆర్ భరోసా.. వీడియో
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
Cult OTT | 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పోచంపల్లి బ్యాంక్‌కు జాతీయ అవార్డు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

