EPFO | పీఎఫ్ డబ్బుల విడతలవారీ ఉపసంహరణకు ఈపీఎఫ్‌వో ఆమోదం.. ఉద్యోగికి ఏం లాభం..?
EPFO | రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల (Employess) పీఎఫ్ నిధుల ఉపసంహరణకు సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత తమ పీఎఫ్ డబ్బుల (PF amount) ను ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించకునేందుకు వీలు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (Systematic Withdrawal Plan) కు ఆమోదం తెలిపింది.
EPFO : రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల (Employess) పీఎఫ్ నిధుల ఉపసంహరణకు సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత తమ పీఎఫ్ డబ్బుల (PF amount) ను ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించకునేందుకు వీలు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (Systematic Withdrawal Plan) కు ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులు ఒకేసారి కాకుండా విడతల వారీగా తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది.
ఓ వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో కూడబెట్టిన నిధిని రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తీసుకొచ్చిన సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం కూడా ఇవాళ (గురువారం) ఆమోద ముద్ర వేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఈ పథకం కింద తన పీఎఫ్ డబ్బుల్లో ఎప్పుడు ఎంత కావాలో అంతే ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్‌వో చందాదారుడు 55 ఏళ్లు దాటిన తర్వాత పదవీ విరమణ పొందితే 100 పర్సెంట్ నిధులను ఉపసంహరించుకోవచ్చు. వారికి 58 ఏళ్లు వచ్చిన తర్వాత పెన్షన్ ప్రయోజనాలు కూడా మొదలవుతాయి. 55 ఏళ్ల కంటే ముందు పదవీ విరమణ చేస్తే మాత్రం తన పీఎఫ్ నిధుల్లోంచి 75 శాతం నిధులనే ఉపసంహరించుకోవడానికి వీలు కలుగుతుంది. మిగిలిన 25 శాతం నిధిని రిటైర్మెంట్ తర్వాత గానీ, 12 నెలలపాటు వరుసగా నిరుద్యోగిగా ఉన్న తర్వాతగానీ ఉపసంహరించుకోవచ్చు.
అయితే ఉద్యోగి రిటైరైన మూడేళ్ల తర్వాత ఆ ఖాతా ఆటోమాటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. ఖతా ఇనాక్టివ్ అయిన తర్వాత ఆ ఖాతాలో నిధుల నిలువ ఉన్నా వడ్డీ రాదు. కొత్తగా ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారమైతే.. నిధులను ఏకమొత్తంలో కాకుండా అవసరమైనప్పుడు అవసరమైనంతే ఉపసంహరించుకోవచ్చు. ప్రతి నెల, లేదంటే ప్రతి క్వార్టర్, ప్రతి ఆరు నెలలకు ఒకసారి, కాదంటే ఏడాదికి ఒకసారి కొంత మొత్తం చొప్పున విత్‌డ్రా చేసుకునేలా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
ఈ ప్లాన్ ప్రకారమైతే విడతలవారీగా నగదును ఉపసంహరించుకుంటున్నప్పటికీ మిగిలిన నిలువపై వడ్డీ వస్తుంది. పాత పద్ధతి మాదిరిగా మూడేళ్ల తర్వాత పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్ కాదు. ఈ ప్లాన్ నుంచి చందాదారుడు ఎప్పుడైనా వైదొలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చందాదారుడు మరణిస్తే అతడి జీవిత భాగస్వామి లేదా నామినీ కూడా ఈ ప్లాన్‌లో కొనసాగవచ్చు. వారు కూడా తమకు ప్లాన్ వద్దనుకున్నప్పుడు వైదొలిగే వెసులుబాటు ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EPFO | పీఎఫ్ డబ్బుల విడతలవారీ ఉపసంహరణకు ఈపీఎఫ్‌వో ఆమోదం.. ఉద్యోగికి ఏం లాభం..?
Shah Rukh Khan | ‘100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్’ జాబితాలో షారుఖ్ ఖాన్.. టాప్-3లో నిలిచిన దిగ్గజాలు వీరే!
KTR | సుస్మితకు న్యాయం జరిగే దాకా పోరాడుతామని తల్లికి కేటీఆర్ భరోసా.. వీడియో
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
Cult OTT | 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

