Omar Abdullah | ‘మానవత్వం కోసం ఇరాన్ యుద్ధంలో జోక్యం చేసుకోండి’.. ప్రధాని మోదీకి ఒమర్ అబ్దుల్లా అభ్యర్థన
Omar Abdullah | మానవత్వం కోసం ఇరాన్ యుద్ధంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై రుద్దిన యుద్ధాన్ని ఆపడానికి ఇతర దేశాలతో సంబంధాలను ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు.
శ్రీనగర్: మానవత్వం కోసం ఇరాన్ యుద్ధంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. (Omar Abdullah) అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై రుద్దిన యుద్ధాన్ని ఆపడానికి ఇతర దేశాలతో సంబంధాలను ఉపయోగించుకోవాలని అభ్యర్థించారు. మానవత్వం కోసం అలా చేయడం చాలా కీలకమని ఆయన అన్నారు. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ శాసనసభ్యులు శుక్రవారం అసెంబ్లీలో నిరసన తెలిపారు. ఒక తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఈ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అన్నారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. బీజేపీ శాసనసభ్యులపై విమర్శలు గుప్పించారు. ‘ఈ సమస్య ఈ ప్రాంతాన్ని నేరుగా ప్రభావితం చేయదని కొందరు వాదించవచ్చు. కానీ ఈ యుద్ధ ప్రభావం అందరిపై పడుతుంది’ అని అన్నారు. యుద్ధం కారణంగా భారతీయ విద్యార్థులు ఇరాన్లో చిక్కుకుపోయారని, ఎల్పీజీ సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారని ఆయన ఉదాహరించారు.
మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు హత్యకు గురికావడాన్ని ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఇది ఒక ఘోరమైన అన్యాయమని అభివర్ణించారు. మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారని అన్నారు.
కాగా, పాఠశాలలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోద యోగ్యం కాదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. యుద్ధం ఉద్దేశ్యాన్ని ఆయన ప్రశ్నించారు. దాని వెనుక ఉన్న కారణాలు బహుశా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా అర్థం కాకపోవచ్చని అన్నారు. ‘ట్రంప్ ఉదయం పూట ఇరాన్లో ప్రభుత్వం మార్పు గురించి మాట్లాడతారు. సాయంత్రం చమురు ధరల గురించి ప్రస్తావిస్తారు’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఈ తాను యుద్ధాన్ని ఖండిస్తున్నానని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘మానవాళికి మేలు జరిగేలా ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రధాని మోదీ తన అధికారాలను ఉపయోగించాలని నేను అభ్యర్థిస్తున్నా. మానవాళిని రక్షించడంలో మన దేశం పాత్ర పోషించగలిగితే, అంతకంటే గొప్ప కార్యం మరొకటి లేదు’ అని ఆయన అన్నారు.
#WATCH | Jammu, J&K: CM Omar Abdullah says, “The manner in which an unlawful war was thrust upon Iran… in a manner that amounted to the murder of humanity, Iranian Supreme Leader Ayatollah Ali Khamenei, along with several of his associates and close relatives, was ruthlessly… pic.twitter.com/x40pjbsyQz
— ANI (@ANI) March 27, 2026
Also Read:
Jag Vasant | గుజరాత్ పోర్ట్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

