న్యూఢిల్లీ : యునెస్కో ప్రమాణాల కంటే విద్యా రంగంపై భారత్ వ్యయం తక్కువగా ఉన్నదని తాజా నివేదిక వెల్లడించింది. విద్యా రంగంపై కనీసం నాలుగు శాతం జీడీపీ లేదా మొత్తం ప్రభుత్వ వ్యయంలో 15 శాతం కేటాయించాలనేది యునెస్కో ప్రమాణం. అయితే భారత్ జీడీపీ పరంగా 4.1శాతం కేటాయిస్తున్నప్పటికీ, ప్రభుత్వ వ్యయంలో మాత్రం 14.2 శాతానికే పరిమి తమయింది.
ఇది 2015లో ఉన్న 15.7శాతం కంటే తక్కువ. మాధ్యమిక విద్య పూర్తి చేయడంలో భారత్ వెనుకబడి ఉందని, నిమ్న మాధ్యమిక(6-8 తరగతులు) పూర్తి చేసే రేటు 86 శాతంగా, ఉన్నత మాధ్యమిక(9-12 తరగతులు) రేటు 51 శాతంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 2030 విద్యా ప్రణాళికలో భాగంగా దేశాలు 4 నుంచి 6% జీడీపీని కేటాయించాలనే నిబద్ధతను ప్రకటించాయి. చైనా, బ్రెజిల్ ప్రమాణాలను అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.