సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘సుధీర్స్ జోకర్’. అయేషా కథానాయిక. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకుడు. శ్రీనివాసులు పీవీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. మురళీశర్మ ఇందులో కీలక పాత్ర పొషిస్తున్నారు. మురళీశర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న ‘డిటెక్టివ్ జీవన్’ పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
మురళీశర్మ కెరీర్లో ‘డిటెక్టివ్ జీవన్’ మరో గొప్ప పాత్రగా నిలుస్తుందని, హీరో చేస్తున్న క్రైమ్‌ని తన ఇంటెలిజెన్స్, ఎక్స్‌పీరియన్స్‌తో డీకోడ్ చేసేందుకు డిటెక్టివ్ జీవన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని మేకర్స్ చెబుతున్నారు. అభిరామి, అజయ్‌ఘోష్, రమేశ్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్‌గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అహ్మద్ షరీఫ్, సంగీతం: లియోన్ జేమ్స్.