Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Sudigali Sudheer | బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్, యాంకరింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇటీవల ‘గోట్’ (GOAT) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే అనేక వివాదాలతో వార్తల్లో నిలిచింది.
Sudigali Sudheer | బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్, యాంకరింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇటీవల ‘గోట్’ (GOAT) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే అనేక వివాదాలతో వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు వాయిదా పడుతూ, దర్శకుడు, హీరోయిన్, హీరో మధ్య విభేదాలు, సినిమా షూటింగ్లో సమస్యలు ఇలా ఎన్నో పరిణామాల మధ్య ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడికి, హీరోయిన్‌కు మధ్య వివాదం తలెత్తడం, అది మహిళా కమిషన్ వరకు వెళ్లడం, దర్శకుడిని సినిమా నుంచి తప్పించారనే ప్రచారం, కొన్ని సన్నివేశాలు లీక్ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు సుడిగాలి సుధీర్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం, షూటింగ్ మధ్యలోనే సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు, ట్రైలర్‌కు డబ్బింగ్ చెప్పలేదనే ప్రచారం కూడా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్, దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ.. సుడిగాలి సుధీర్ షూటింగ్‌కు రావడానికి నిరాకరించారని, చివరి 30 శాతం షూటింగ్ ఆయన లేకుండానే పూర్తి చేయాల్సి వచ్చిందని తెలిపారు. క్లైమాక్స్‌లో కొన్ని సన్నివేశాలను డూప్స్, సీజీ సహాయంతో చిత్రీకరించాల్సి వచ్చిందని చెప్పారు. రెమ్యునరేషన్ మొత్తం తీసుకున్నప్పటికీ షూటింగ్‌కు రావడం లేదని, ఈ విషయంపై ప్రశ్నించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. బడ్జెట్ పెరుగుతున్న విషయాన్ని సుధీర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని, దర్శకుడి వైపే నిలిచారని అన్నారు.
అంతేకాదు.. సుధీర్ అడిగారని సినిమా బడ్జెట్‌ను మరో రెండు కోట్లు పెంచానని, అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదని నిర్మాత వాపోయారు. మొదట సుధీర్ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, సినిమా పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటాడని భావించానని, కానీ తన అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించారు. షూటింగ్‌కు రావాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, చివరకు తన ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ చేశారని ఆరోపించారు. మేనేజర్ ద్వారా షూటింగ్‌కు రాలేనని సమాచారం పంపించారని వెల్లడించారు. ఇక సినిమాలో రష్మీ గౌతమ్‌ను సెకండ్ హీరోయిన్గా తీసుకురావాలని మొదట చర్చించుకున్నామని నిర్మాత తెలిపారు. సుధీర్ ఆమెతో మాట్లాడతానని చెప్పారని, ఆమె అంగీకరించకపోతే కనీసం ఐటెం సాంగ్‌లో అయినా తీసుకుందామని భావించామని వివరించారు. సుధీర్, దర్శకుడు మంచి స్నేహితులు కావడంతో మొదట్లో వారు చెప్పిన విషయాలను నమ్మానని, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. సినిమా ప్రారంభంలోనే సుధీర్ పాత్ర చిత్రణపై తనకు సందేహాలు వచ్చాయని, దర్శకుడిని అడిగితే ఎలాంటి సమస్య లేదని చెప్పారని పేర్కొన్నారు.
మరోవైపు ఈ సినిమా బడ్జెట్ విషయంలోనూ నిర్మాత కీలక విషయాలు వెల్లడించారు. మొదట రూ.3.5 కోట్లతో సినిమాను పూర్తి చేయాలని అనుకున్నామని, ఆ తర్వాత బడ్జెట్ రూ.5 కోట్లకు చేరిందని చెప్పారు. 30 శాతం షూటింగ్ పూర్తయ్యే సమయానికే ఖర్చు రూ.9 కోట్లు దాటిందని, అనంతరం మరో దర్శకుడిని తీసుకొచ్చి మిగిలిన పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని తెలిపారు. చివరకు సినిమా మొత్తం నిర్మాణానికి సుమారు రూ.14 కోట్లు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

