Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
AcademyAwards | ప్రతిష్ఠాత్మక 99వ ఆస్కార్ పురస్కారాల (Academy Awards) బరిలో భారతీయ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో భారత్ నుంచి ‘గోంధల్’, ‘అంగ్’ చిత్రాలు పరిశీలనకు ఎంపికవగా, తాజాగా మరో భారతీయ లఘు చిత్రం అకాడమీ అవార్డుల రేసులోకి అడుగుపెట్టింది.
ప్రతిష్ఠాత్మక 99వ ఆస్కార్ పురస్కారాల (Academy Awards) బరిలో భారతీయ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో భారత్ నుంచి ‘గోంధల్’, ‘అంగ్’ చిత్రాలు పరిశీలనకు ఎంపికవగా, తాజాగా మరో భారతీయ లఘు చిత్రం అకాడమీ అవార్డుల రేసులోకి అడుగుపెట్టింది. తెలుగు మూలాలున్న ఇద్దరు యువతులు రూపొందించిన కన్నడ-తెలుగు లఘు చిత్రం ‘పంకజ’ (Pankaja) ఆస్కార్ పరిశీలనకు అధికారికంగా అర్హత సాధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.
ఈ 14 నిమిషాల లఘు చిత్రానికి అనూయ స్వామి రచన, దర్శకత్వం వహించగా, రంగస్థల నటి హర్షిణి బోయళ్ల ప్రధాన పాత్రలో నటించారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ఇద్దరు తెలుగమ్మాయిలు కలిసి ఒక సహజసిద్ధమైన, హృదయాన్ని హత్తుకునే కథను తెరపైకి తెచ్చారు. బెంగళూరులోని ఒక మురికివాడలో నివసించే సామాన్య కుటుంబాల జీవన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అదృశ్యమైన తన భర్తను వెతుక్కుంటూ తన చిన్నారి కుమార్తెతో కలిసి పంకజ అనే మహిళ సాగించే ఆవేదనాభరిత ప్రయాణమే ఈ కథాంశం. ఈ క్రమంలో అధికారం, వ్యవస్థల్లోని లోపాలను అడ్డుపెట్టుకుని కొందరు సామాన్యులను ఏ విధంగా వేధింపులకు గురిచేస్తున్నారన్న కఠిన వాస్తవాలను దర్శకురాలు అనూయ అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించారు. వాస్తవికత ఉట్టిపడేలా నిజమైన లొకేషన్లలో, స్థానిక కళాకారులతో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం విశేషం.
న్యూయార్క్ యూనివర్సిటీ (NYU టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్)లో మీడియా ఆర్ట్స్ కోర్సు చేస్తున్న సమయంలో రెండో ఏడాది స్టూడెంట్ ప్రాజెక్టుగా అనూయ స్వామి ‘పంకజ’ను రూపొందించారు. తొలుత ప్రతిష్ఠాత్మక సన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శితమైన ఈ చిత్రం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు పొందింది. ముఖ్యంగా యూకేలో జరిగిన రెయిన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ‘ఉత్తమ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకోవడం ద్వారా నేరుగా ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది.
ఆస్కార్ ప్రచారంలో భాగంగా ఈ లఘు చిత్రానికి ఇప్పుడు దిగ్గజ సినీ ప్రముఖుల మద్దతు కూడా లభించింది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్పైక్ లీ, విలక్షణ నటుడు విలెం డఫో (Willem Dafoe), అలాగే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రంతో భారత్‌కు ఆస్కార్ అందించిన నిర్మాత గునీత్ మోంగా కపూర్ ‘పంకజ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు. గతంలో న్యూయార్క్ యూనివర్సిటీలో స్పైక్ లీ వద్ద టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేసిన అనూయ స్వామి రూపొందించిన చిత్రానికి, ఇప్పుడు ఆయనే నిర్మాతగా తోడవ్వడం విశేషం. ఒక సాధారణ స్టూడెంట్ ప్రాజెక్టుగా మొదలై, ప్రపంచ సినీ దిగ్గజాల ప్రశంసలతో ఆస్కార్ వేదిక దిశగా అడుగులు వేస్తున్న ‘పంకజ’ ప్రయాణం తెలుగు, భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

