Bengaluru Professor | ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పిలిచిన ప్రొఫెసర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Bengaluru Professor | ఒక ప్రొఫెసర్ సహనం కోల్పోయాడు. క్లాస్‌లో అందరి ముందు ఒక ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పిలిచాడు. ఇరాన్ యుద్ధానికి ఇలాంటి వారే కారణమని ఆరోపించాడు. కొందరు విద్యార్థులు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: ఒక ప్రొఫెసర్ సహనం కోల్పోయాడు. క్లాస్‌లో అందరి ముందు ఒక ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పిలిచాడు. ఇరాన్ యుద్ధానికి ఇలాంటి వారే కారణమని ఆరోపించాడు. కొందరు విద్యార్థులు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bengaluru Professor) ఈ నేపథ్యంలో ఆ ప్రొఫెసర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మార్చి 24న బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే క్లాస్‌లో దూకుడుగా వ్యవహరించారు. ముస్లిం విద్యార్థి అఫాన్ ఒకరిని కలవడానికి తరగతి గది నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన అనుమతి కోరాడు.
కాగా, టీచింగ్ చేస్తున్న ప్రొఫెసర్ మురళీధర్ దేశ్‌పాండే సహనం కోల్పోయారు. ‘నీకు సిగ్గు లేదా?’ అని ఆ విద్యార్థిపై గట్టిగా అరిచారు. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా ఉండాలని అనుకున్నానని అన్నారు. ఆ విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని ఆయన సంబోధించారు. ‘ఇరాన్ యుద్ధానికి నీలాంటి వాళ్లే కారణం’ అని నిందించారు. ‘డొనాల్డ్ ట్రంప్ వచ్చి అతడ్ని తీసుకుపోతాడు’ అని హేళన చేశారు. ‘నరకానికి పో’ అంటూ దూషించారు.
మరోవైపు ఆ క్లాస్‌లోని కొందరు విద్యార్థులు మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్రొఫెసర్‌పై విమర్శలు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిగే వరకు ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అలాగే ముస్లిం స్టూడెంట్‌కు క్లాస్‌లో మద్దతు ఇవ్వడంతోపాటు వీడియో రికార్డ్ చేసి షేర్ చేసిన ముగ్గురు విద్యార్థులను కూడా పలు కారణాలతో సస్పెండ్ చేసింది.
కాగా, కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎస్యూఐ) ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
‘I will call you terrorist’: Bengaluru PES University professor abuses minority student in classroom
Dr Muralidhar Deshpande said,
“Sharm nahi aati tumko (do you feel no shame)? Useless fellow, terrorist”
— Shreedhar Rathi (SRR) (@sdraathi) March 28, 2026
Also Read:
Woman elopes twice | వారంలో రెండుసార్లు పారిపోయిన మహిళ.. ఆమె భర్తను బెదిరించిన ప్రియుడు
Watch: స్కూటీని రాసుకుని వెళ్లినందుకు.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ధ్వంసం చేసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

