ముంబై: పలువురు మహిళలపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్కుడు అశోక్ ఖరత్‌తో సంబంధంపై విమర్శల నేపథ్యంలో ప్రభుత్వ, పార్టీ పదవులకు రూపాలీ చకాన్కర్ (Rupali Chakankar) రాజీనామా చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర మహిళా విభాగం అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధ్యక్షురాలు సునేత్ర పవర్‌తో చర్చించిన తర్వాత ఎన్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవికి రాజీనామా సమర్పించా’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, అశోక్ ఖరత్, ఆయన ఆలయ ట్రస్ట్‌తో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మార్చి 20న మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్ష పదవి నుంచి రూపాలీ తప్పుకున్నారు. సీఎం ఫడ్నవీస్ సూచన మేరకు ఆ పదవికి చేసిన రాజీనామా లేఖను కూడా డిప్యూటీ సీఎం సునేత్ర పవర్‌కు ఆమె అందజేశారు. అశోక్ ఖరత్ ఆర్థిక వ్యవహారాలతో గానీ, ఆయనపై వచ్చిన ఆరోపణలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు.
మరోవైపు నాసిక్ జిల్లా మిర్గావ్లో ఒక ఆలయ ట్రస్ట్‌కు అధిపతిగా, ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరుగాంచిన అశోక్ ఖరత్ గత మూడేళ్లుగా తనపై అత్యాచారం చేసినట్లు ఒక మహిళ ఆరోపించింది. దర్యాప్తు చేసిన పోలీసులు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 58 మంది మహిళలతో లైంగిక చర్యల వీడియోలను ఒక పెన్ డ్రైవ్‌లో గుర్తించారు. దీంతో మర్చంట్ నేవీ మాజీ కెప్టెన్ కూడా అయిన అశోక్ ఖరత్‌ను మార్చి 18న పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
खरात प्रकरणाबाबत पहिल्या दिवशीच मी माझी भूमिका स्पष्ट केली आहे.त्याच्या आर्थिक व्यवहारात,त्याच्या गैरकृत्यात दुरान्वये संबंध नाही,आजही तीच स्पष्ट व ठाम भूमिका आहे.तपासादरम्यान या सर्व बाबी निष्पन्न होतीलच. खोटे,असत्य व कुठलाही पुरावा नसताना जे आरोप माध्यमांमधून होत आहेत,ते… pic.twitter.com/9awsGZmgJL
— Rupali Chakankar (@ChakankarSpeaks) March 27, 2026
Also Read:
Claims As Godman, Man Raps Woman | శివుడి అవతారమని నమ్మించిన వ్యక్తి.. మహిళపై అత్యాచారం
Woman elopes twice | వారంలో రెండుసార్లు పారిపోయిన మహిళ.. ఆమె భర్తను బెదిరించిన ప్రియుడు