Allu Arjun | శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి.. ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్.. !
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఫ్యామిలీతో సమయం గడపడానికి ముందుంటారు. అందుకే బన్నీని అభిమానులు ఓ మంచి ఫ్యామిలీ మ్యాన్‌గా అభివర్ణిస్తుంటారు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఫ్యామిలీతో సమయం గడపడానికి ముందుంటారు. అందుకే బన్నీని అభిమానులు ఓ మంచి ఫ్యామిలీ మ్యాన్‌గా అభివర్ణిస్తుంటారు. తాజాగా అల్లు కుటుంబం మొత్తం కలిసి శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఓ ప్రత్యేక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నవంబర్ 21న అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు ఫ్యామిలీ వెకేషన్లో భాగంగా అల్లు కుటుంబ సభ్యులంతా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఓ అందమైన రిసార్ట్‌లో కుటుంబ సభ్యులంతా కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేశారు.
ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను అల్లు శిరీష్ భార్య నయనికా రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో అల్లు కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఓపెన్ ఎయిర్ రిసార్ట్‌లో క్యాండిల్ లైట్ వెలుతురులో కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలో అల్లు అర్జున్ గ్రే కలర్ జెర్సీ టీషర్ట్, కొత్త హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన పక్కనే తండ్రి అల్లు అరవింద్, నయనికా రెడ్డి కూర్చున్నారు. మరోవైపు తల్లి నిర్మల, సోదరుడు అల్లు శిరీష్, భార్య స్నేహారెడ్డి కనిపిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ తమ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫొటోకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా బర్త్‌డే గర్ల్ అర్హ ఫొటోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఫొటోలో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కుటుంబం మాత్రం కనిపించలేదు. ఈ ఏడాది మార్చిలో అల్లు శిరీష్, నయనికా రెడ్డి వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అల్లు కుటుంబం మొత్తం కలిసి విదేశీ వెకేషన్లో సందడి చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సభ్యులంతా ఇలా ఒకే చోట కలిసి ఆనందంగా గడుపుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యామిలీ బాండింగ్ చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి.. ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్.. !
Vishwak Sen | 21 ఏళ్లకే ప్రేమించిన అమ్మాయి దూరమైంది.. అప్పులు చేసి మరీ ఛాన్స్ కోసం తిరిగాను : విశ్వక్ సేన్
Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
Naga Chaitanya | ఏడవాలని ఉంటుంది, కానీ కన్నీళ్లు రావు.. తనలోని బాధను బయటపెట్టిన నాగ చైతన్య
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

