Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Aadarsha Kutumbam | టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఎన్నో వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Aadarsha Kutumbam | టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఎన్నో వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. కమర్షియల్‌గా నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
‘ఆదర్శ కుటుంబం’ సినిమా నవంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ‘కమింగ్ సూన్’ కేటలాగ్‌లో ధృవీకరించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు మరోసారి చూసే అవకాశం దక్కనుంది. ముఖ్యంగా వెంకటేష్ అభిమానులు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్, త్రివిక్రమ్‌కు ఉన్న ప్రత్యేకమైన రచనా శైలి సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా నిరాశపరిచింది. మరి ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, యూవినా పార్తవి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, రాజా ప్రజ్వల్, దేవయాని శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కుటుంబ సంబంధాలు, క్రైమ్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ సినిమాకు డిజిటల్ ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nayanthara | నయనతార పోలికతో ట్రాన్స్‌జెండర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు.. !
Chiranjeevi | ఓటీటీ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్.. ‘మెగావర్స్’ కోసం చిరంజీవికి రూ.200 కోట్లు ఇస్తున్నారా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ.. అమన్‌తో శివ గొడవ.. హౌస్‌లో రచ్చ రచ్చ!
Deeksha Diwas | లక్ష మందితో ‘దీక్షా దివస్’ సభ.. 40 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

