Vishwak Sen | 21 ఏళ్లకే ప్రేమించిన అమ్మాయి దూరమైంది.. అప్పులు చేసి మరీ ఛాన్స్ కోసం తిరిగాను : విశ్వక్ సేన్
Vishwak Sen | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.
Vishwak Sen | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. దాదాపు రూ.50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో విశ్వక్ సేన్ తన సినీ ప్రయాణం, కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తనకు జీవితంలో మరో అవకాశం ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన తర్వాత తనకు 17 ఏళ్ల వయసులోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలైందని చెప్పారు. కృష్ణానగర్‌లోని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆడిషన్స్ ఇచ్చేవాడినని తెలిపారు. 21 ఏళ్ల వయసులో తనకు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని, తన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయనే కారణంతో ఆమె కూడా దూరమైందని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ఓ సినిమాలో హీరోగా ఎంపికయ్యానని చెప్పి, ఆ తర్వాత సెకండ్ హీరో, థర్డ్ హీరో, నాలుగో హీరో అంటూ తన పాత్రను మార్చుకుంటూ వెళ్లారని తెలిపారు. అయినప్పటికీ అవకాశం వస్తుందనే ఆశతో సినిమా ఆఫీసుకు వెళ్లడం ఆపలేదన్నారు. దాదాపు 20 రోజుల పాటు ఆఫీసు చుట్టూ తిరిగిన తర్వాత చివరకు తనను సినిమా నుంచి తొలగించి మరొకరిని ఎంపిక చేసుకున్నారని చెప్పారు.
సినిమాలో అవకాశం వస్తుందనే ఆశతో అప్పులు చేసి మరీ ఆ టీమ్‌కు ఖర్చులు పెట్టానని విశ్వక్ వెల్లడించారు. తన గర్ల్‌ఫ్రెండ్ దూరమైనప్పుడు కూడా అంతగా ఏడవలేదని, కానీ సినిమా నుంచి తొలగించారని తెలిసినప్పుడు మాత్రం మూడు రోజుల పాటు ఏడ్చానని ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలోనే మలయాళంలో ఓ సినిమా చూసి తానే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నానని, ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ఫలక్‌నుమా దాస్’ అని వెల్లడించారు. నిజానికి నటుడిగా ఓ 40 ఏళ్ల వయసు వచ్చాక దర్శకత్వం చేయాలని అనుకున్నానని, కానీ తనను హీరోగా పెట్టి ఎవరూ సినిమా తీయడానికి ముందుకు రాకపోవడంతో 21 ఏళ్ల వయసులోనే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక సినిమా పరిశ్రమలో ఫ్లాప్స్ ఎదురైనప్పుడు నటీనటులకు లభించే గౌరవం కూడా తగ్గిపోతుందని విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చే ట్రోల్స్ చూసి బాధపడతానని, అవి తన కుటుంబ సభ్యులకు తెలిస్తే వారు కూడా బాధపడతారని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | 21 ఏళ్లకే ప్రేమించిన అమ్మాయి దూరమైంది.. అప్పులు చేసి మరీ ఛాన్స్ కోసం తిరిగాను : విశ్వక్ సేన్
Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
Naga Chaitanya | ఏడవాలని ఉంటుంది, కానీ కన్నీళ్లు రావు.. తనలోని బాధను బయటపెట్టిన నాగ చైతన్య
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nayanthara | నయనతార పోలికతో ట్రాన్స్‌జెండర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు.. !
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

