Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
Tharun Bhascker | టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఈఎన్ఈ రిపీట్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంటోంది.
Tharun Bhascker | టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఈఎన్ఈ రిపీట్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో మాట్లాడటమే కాకుండా, ఇండస్ట్రీలో తనను తక్కువగా అంచనా వేస్తున్నవారికి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఈఎన్ఈ రిపీట్’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఫస్ట్ వీకెండ్లోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.50 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ వేడుకలో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రియదర్శి, కరుణ్ కుమార్, శివాత్మిక తదితరులు ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చి అద్భుతమైన నటనను కనబరిచారని ప్రశంసించారు. నందిని రెడ్డి కూడా అద్భుతమైన నటి అని, తన నటనతో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. అలాగే తన డైరెక్షన్ టీమ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి గురించి మాట్లాడుతూ.. డైరెక్షన్ టీమ్‌కు వారు సరైన గౌరవం ఇచ్చారని ప్రశంసించారు. దర్శకత్వం అనేది కేవలం కూలి పని కాదని, ఎంతో నేర్చుకుని, శ్రమించి చేసే బాధ్యతాయుతమైన పని అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రేక్షకులపై తనకున్న ప్రేమను తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటారని, కానీ లెక్కలేకుండా ప్రేమించేది ప్రేక్షకులు మాత్రమేనని అన్నారు. తన నేపథ్యం, స్థాయి గురించి ఆలోచించకుండా సినిమాపై ప్రేమతో తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమేనని, అసలైన గేమ్ ఛేంజర్స్ ప్రేక్షకులేనని పేర్కొన్నారు. ఇప్పటివరకు డబ్బుకు పెద్దగా విలువ ఇవ్వొద్దని, డబ్బు వెంట పడకూడదని చెప్పేవాడినని గుర్తుచేసుకున్నారు. కానీ ఇకపై తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటానని, తదుపరి సినిమా నుంచి ఏ, బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. చాలామంది తనను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారని, అయితే ఒక నిజాయితీగల గొంతు ఎంత దూరం వెళ్లగలదో చూపిస్తానని అన్నారు.
నేను మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడమ్ అని పిలవను. నాకు జనమే ముఖ్యం. నేను దర్శకత్వం చేసినా, నటించినా ఎంతో శ్రద్ధతో పనిచేస్తాను. నా వాయిస్ ఏంటో చూపిస్తాను. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే నా సినిమాల ద్వారా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
Naga Chaitanya | ఏడవాలని ఉంటుంది, కానీ కన్నీళ్లు రావు.. తనలోని బాధను బయటపెట్టిన నాగ చైతన్య
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nayanthara | నయనతార పోలికతో ట్రాన్స్‌జెండర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు.. !
Chiranjeevi | ఓటీటీ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్.. ‘మెగావర్స్’ కోసం చిరంజీవికి రూ.200 కోట్లు ఇస్తున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

