Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మంధాన ప్రస్తుతం తన కెరీర్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వ్యక్తిగత జీవితంపై ఎన్ని ఊహాగానాలు వచ్చినా, సినిమాల విషయంలో మాత్రం ఆమె ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని తన వరుస ప్రాజెక్టులతో క్లారిటీ ఇస్తుంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి తర్వాత కెరీర్ వేగం తగ్గించుకుంటారు. కానీ రష్మిక మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తే, రాబోయే రెండేళ్లు బాక్సాఫీస్ వద్ద ఆమె ఆధిపత్యం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఆమె క్రేజ్ గణనీయంగా పెరిగింది. ఇప్పటికే పుష్ప3లో శ్రీవల్లి పాత్రతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంతేకాదు, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా రష్మిక పేరు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే ఐకాన్ స్టార్‌తో ఆమెకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా రష్మిక జోరు తగ్గడం లేదు. యానిమల్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ఆమె, దాని సీక్వెల్ యానిమల్ పార్క్‌లో మరోసారి గీతాంజలి పాత్రలో కనిపించనుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటనపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ‘కాక్టెయిల్ 2’ వంటి ప్రాజెక్టులతో హిందీ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది.
గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, రష్మిక ఇప్పుడు విభిన్న కథలతో ముందుకు వస్తోంది. ‘మైసా’, ‘రణబాలి’ వంటి చిత్రాల్లో కొత్త తరహా పాత్రలతో తన నటనలోని మరో కోణాన్ని చూపించనుంది. ప్రత్యేకంగా ‘రణబాలి’లో విజయ్ దేవరకొండతో కలిసి నటించబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందని అనుకునే ట్రెండ్‌ను రష్మిక పూర్తిగా మార్చేస్తోంది. భారీ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు, విభిన్న పాత్రలు కలిసి ఆమెను ఇండియన్ సినిమా టాప్ హీరోయిన్గా నిలబెడుతున్నాయి. ఏది ఏమైన , స్టార్డమ్ తగ్గకుండా, మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా రష్మిక ముందుకు సాగుతోంది. రాబోయే కాలంలో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాలతో ఆమె పేరు మరింత మోగడం ఖాయంగా కనిపిస్తోంది