Watch: శోభాయాత్ర సందర్భంగా.. గాలిలోకి కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే
Odisha MLA Fires Gun Shots In Air | శోభాయాత్ర సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. గన్తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు.
భువనేశ్వర్: శోభాయాత్ర సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. గన్తో గాలిలోకి కాల్పులు జరిపారు. (Odisha MLA Fires Gun Shots In Air) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారిపై కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా బలంగీర్ జిల్లాలో శోభాయాత్ర నిర్వహించారు.
కాగా, టిట్లాగఢ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నవీన్ కుమార్ జైన్ ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ప్యాంటు జేబు నుంచి గన్ తీసి గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో శోభాయాత్రలో పాల్గొన్న వందలాది భక్తులు, స్థానికులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే నవీన్ కుమార్ జైన్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్వో) ప్రేమ్చంద్ నాగ్పై కేసు నమోదు చేశారు. ఆ గన్ను స్వాధీనం చేసుకున్నారు. పీఎస్వోపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, సస్పెండ్ చేశామని బలంగీర్ ఎస్పీ అభిలాష్ తెలిపారు. ఎమ్మెల్యే భద్రతా విధుల నుంచి ఆ పీఎస్వోను తొలగించినట్లు వెల్లడించారు.
MLA Caught on Camera in Alleged Celebratory Firing
Titlagarh MLA Nabin Kumar Jain was caught on camera allegedly firing a pistol belonging to his PSO.
Celebratory firing is prohibited under the Arms Act, as it endangers public safety.
All eyes are now on @spbalangir and IGP… pic.twitter.com/Syu4JMtcYv
— Soumyajit Pattnaik (@soumyajitt) March 28, 2026
Also Read:
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP MLA
- Case filed
- fires
- Gun shots
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

