Bengaluru Jail Inmates Use Mobiles, TV | మొబైల్ ఫోన్లు, టీవీ వాడుతున్న బెంగళూరు జైలు ఖైదీలు.. ముగ్గురు సిబ్బంది సస్పెండ్
Bengaluru Jail Inmates Use Mobiles, TV | కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ జైలులోని ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీ వాడుతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ముగ్గురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ జైలులోని ఖైదీలు మొబైల్ ఫోన్లు, టీవీ వాడుతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bengaluru Jail Inmates Use Mobiles, TV) ఈ నేపథ్యంలో ముగ్గురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఖైదీలు విలాసవంతమైన జీవితం గడుతున్నారు. ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడటంతో పాటు టీవీ చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా యాక్సెస్ చేస్తున్నారు. ఐపీల్ క్రికెట్ మ్యాచ్‌లపై కూడా చర్చించుకున్నారు.
కాగా, ఒక హత్య కేసులో రెండున్నర సంవత్సరాలకుపైగా జైలులో ఉన్న ఖైదీలు మార్చి 27న ఈ వీడియోను రికార్డ్ చేశారు. తమకు తెలిసిన బయట వ్యక్తులకు దీనిని షేర్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీల గదుల్లో తనిఖీలు చేశారు. టాయిలెట్ బ్లాక్ సమీపంలోని భూగర్భ పైప్‌లైన్ ప్రాంతంలో మొబైల్ ఫోన్స్ దాచిపెట్టినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ముగ్గురు జైలు వార్డెన్లను సస్పెండ్ చేశారు.
కాగా, పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీల అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి గత కొన్ని నెలలుగా కఠిన చర్యలు అమలు చేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. అయితే తమ ప్రయత్నాలను దెబ్బతీయడానికే ఈ వీడియో వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. జైళ్ల డీజీపీ అలోక్ కుమార్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏదైనా అంతర్గత కుట్ర జరుగుతున్నదా అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Parappana Agrahara twist 🚨
Viral jail “luxury” video now exposed as staged conspiracy to target DGP Prisons Alok Kumar after crackdown.
3 wardens suspended for negligence as probe tightens.pic.twitter.com/LZzpPldYRW
— Gk (@Ggk_here_) March 29, 2026
Also Read:
Army rejects milk powder | నాణ్యతా లోపం.. 125 మెట్రిక్ టన్నుల పాల పొడిని తిరస్కరించిన ఆర్మీ
Girl Body in Flour Drum | పిండి డబ్బాలో బాలిక మృతదేహం.. ఎన్కౌంటర్లో నిందితుడు హతం
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

