Private Train | దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు పేరు తేజస్. ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రారంభించింది. ఇది లక్నో-ఢిల్లీ మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఈ రైలును స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్ అని పిలువనున్నారు. ఈ ప్రకటన హక్కులను ఆరునెలల కాలానికి ఐఆర్సీటీసీ కల్పించింది. దీంతో ఈ రైలును ‘స్ప్రైట్ తేజస్ ఎక్స్‌ప్రెస్’ పిలవాలని నార్త్ ఈస్టర్న్ రైల్వే సూచించింది. దేశంలో ఒక రైలుకు బ్రాండ్ పేరు పెట్టడం ఇదే మొదటిసారి.
సూపర్‌ఫాస్ట్ (Superfast) రైలు అయిన దీనిలో ఏసీతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. దీనిలో ఆహార, పానీయాలు, ఇన్ఫోటైన్మెంట్ సేవలు కల్పిస్తారు. అదేవిధంగా గ్రూప్ బుకింగ్ చేసుకోవచ్చు. సమావేశాలు, వివాహాలు, ఏదైనా ఈవెంట్ కోసం 78 సీట్ల ఏసీ చైర్ కార్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్రైవేట్ రైలు ట్రాకులు, మౌలిక సదుపాయాలు వినియోగించుకుంటున్నందుకు అయ్యే ఖర్చును ఐఆర్సీటీసీ భారతీయ రైల్వేకు చెల్లిస్తుంది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు అయిన తేజస్‌ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2021, డిసెంబర్ 3న ప్రారంభించారు.