Al-Qaeda | ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి
Al-Qaeda | ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద కారులో జరిగిన పేలుళ్ల వెనుక అల్‌ఖైదా (Al-Qaeda) అనుబంధ ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS)' కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Al-Qaeda : ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద కారులో జరిగిన పేలుళ్ల వెనుక అల్‌ఖైదా (Al-Qaeda) అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS)’ కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. AQIS ను ప్రాంతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఉగ్రవాద సంస్థగా నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తున్నది.
తాలిబన్ల నుంచి AQIS కు మద్దతు, ఆశ్రయం లభిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. దాంతో పలు ప్రాంతాల్లో అల్‌ఖైదా నెట్వర్క్ మరోసారి బలపడుతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ సహా ఆయా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు AQIS ముప్పుగా మారే అవకాశం ఉందని భద్రతావర్గాలు భావిస్తున్నాయి. 2025 నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన కుట్ర, ఉగ్రవాద నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నివేదికలోని అంశాలు కీలకంగా మారాయి. AQIS తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రాంతీయ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల మద్దతుతో AQIS కు పలు ప్రాంతాల్లో సురక్షిత స్థావరాలు లభిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఈ నివేదికతో మరోసారి చర్చకు వచ్చాయి.
ఉగ్రవాద సంస్థల కదలికలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. ఢిల్లీ పేలుళ్ల కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే కొద్దీ ఈ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

