బూర్గంపహాడ్, సెప్టెంబర్ 26 : రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర సారపాక ఆధ్వర్యంలో నేషన్ బిల్డర్స్ అవార్డ్స్ పేరుతో కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర అధ్యక్షుడు ఆర్పీ సింగ్ క్లబ్ బాధ్యులతో కలిసి మండలంలో ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులకు రోటరీ అవార్డులు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ బాధ్యులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో చూపుతున్న శ్రద్ధ, క్రమశిక్షణ, నైపుణ్యం, జ్ఞానం అందించడంలో ఎంతో కీలకపాత్ర వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వప్రెసిడెంట్ ఆర్పీ సింగ్, జేకే దాస్, కార్యదర్శి డేవిడ్ అలీవర్, గుత్తేదారులు పాకాల దుర్గాప్రసాద్, బసప్ప రమేష్, మహేష్‌రెడ్డి, యాకూబ్, ఏసోబు, సుధాకర్‌రెడ్డి, సాయిరాం, సూర్యప్రకాష్, ఫణి, తిరుపతిరావు, రోటరాక్టర్స్ మయాంక్, సంగీత్ పాల్గొన్నారు.